ఏపీ సీఎంకు సుప్రీంకోర్టు షాక్ !!

September 21, 2020

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఆశ పెట్టుకున్న జగన్ కు సుప్రీం షాక్ ఇచ్చింది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి పరిమితికి రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రయత్నించిన జగన్ బ్యాచ్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థలల్లో ఎన్నికల రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం స్థానాలను కేటాయిస్తూ ఏపీ సర్కారు  జీవో నెం.176 ను జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ కర్నూల్ కు చెందిన బిర్రు ప్రతాప్ రెడ్డి పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు ప్రభుత్వం నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేస్తూ స్టేకు నిరాకరించింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషను పరిశీలించిన  అత్యున్నత న్యాయస్థానం ఎన్నికలకు బ్రేక్ వేసింది. 

పిటిషను దారు పేర్కొన్న ప్రకారం చూస్తే... రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని,  ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన సీట్ల రిజర్వేషన్ యాభై శాతం దాటకుండా చూడాలంటూ రెండు పిటిషన్లను విచారించిన ఎపెక్స్ కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును హైకోర్టుకు బదలాయిస్తూ నాలుగు వారాల్లోగా కేసు విచారణను పూర్తి చేయాలని హైకోర్టును సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశించింది. ఇక్కడితో వదలని కోర్టు... అసలు రిజర్వేషన్లు యాభై శాతం మించి ఎందుకు నిర్ణయించారు, దానికి కారణాలు కూడా చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి ఆర్డరు వేసింది.