జగన్ మరో రాంగ్ డెసిషన్ - ప్రజలు, పార్టీల మండిపాటు

September 24, 2020

ముఖ్యమంత్రి జగన్.. సామాన్యులకు దూరమయ్యే మరో నిర్ణయం తీసుకున్నారు. రాచరిక పద్ధతిలో ప్రభుత్వం గురించి ఎవరూ చెడు మాట్లాడకుండా, విమర్శలు చేయకుండా ఉండేందుకు... రాజ్యాంగ బద్ధంగా సంక్రమించిన ప్రాథమిక హక్కు అణచివేతకు దారితీసే ఒక నిర్ణయాన్ని తీసుకోవడమే కాదు... దానికి సంబంధించిన జీవోను విడుదల చేశారు. ఆ జీవో ఏం చెబుతుంది అంటే... ‘‘నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుని అధికారం సంబంధి విభాగం అధికారులకు ఉంటుంది. అలాగే, సోషల్ మీడియాలో చేసే నిరాధార పోస్టులపైనా ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు’’ ఇది జీవో సారాంశం. 

ఈ జీవో భవిష్యత్తులో అనేక ప్రమాదాలకు దారితీస్తుంది. ప్రజలు ప్రభుత్వం గురించి తమ అభిప్రాయం చెప్పడానికి సంకోచించేలా చేస్తుంది. తమకు నచ్చనిది మాట్లాడినా, అభిప్రాయం చెప్పినా... అది నిరాధారం కింద చర్యలు తీసుకునే హక్కు అధికారులకు ఉన్నపుడు ఎవరూ మాట్లాడే ధైర్యం చేయరు. మీడియా మీదే కాకుండా, సామాన్యు గొంతుక పైన ఏపీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపినట్టు అయ్యింది. వార్తలు ప్రచురించే పబ్లిషర్లు, ఎడిటర్లపై కేసులు దాఖలు చేసేలా ఆయా శాఖల అధికారులకు అధికారం ఇచ్చింది. ఈ జీవో వివాదాలకు కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపై సోషల్ మీడియాలో వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమవుతోంది. 
 
చంద్రబాబు స్పందన
‘‘ప్రశ్నించడం, విమర్శించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం.. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 భావ ప్రకటన స్వేచ్ఛకు శరాఘాతం. ప్రజా గొంతుకను నొక్కేయడానికే వైసీపీ పార్టీ దీన్ని అమలులోకి తెచ్చింది. దీంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన మీడియా సంస్థలపై, ప్రజలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టే ఆస్కారాన్ని కల్పించారు. ఈ జీవోని రద్దు చేసే వరకూ అవసరమైతే మేము రోడ్లెక్కి నిరసనలు చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం’’ అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.