14ఏళ్ల సీఎంనైన నన్ను అడ్వయిజర్ వచ్చి వెళ్లిపొమ్మంటాడా..? చంద్ర బాబు

September 24, 2020

చంద్రబాబునాయుడు నేను గ్యాలరీలోనే ఉన్నాను. ఈ పరిస్థితుల్లో రూమ్ లో కూర్చోవడం సరైందికాదనే గ్యాలరీలోకి వచ్చాను. 14ఏళ్ల సీఎంనైన నన్ను అడ్వయిజర్ వచ్చి వెళ్లిపొమ్మంటాడా..? మార్షల్ వచ్చి వెళ్లిపొమ్మంటారా..? కౌన్సిల్ ఛెయిర్ పర్సన్ ను చెప్పమనండి వెళ్లిపోతా అని చెప్పాను. నిబంధనలు పాటించే తొలి పౌరుడిగా నేను ఉంటాననేది అందరికీ తెలుసు..అందుకే అడగ్గానే సెల్ ఫోన్ ఇచ్చేశాను. అలాంటిది కిందనుంచి పైకి వాటర్ బాటిల్స్ విసురుతారా..? పైనుంచి కిందకు కాగితాలు విసిరేస్తారా..? నాకు అడ్డంగా ఒకరు నించుంటారా..? నన్ను మానసికంగా హింసించాలని చూస్తారా..? మీరు కొడితే నేను గమ్మున ఉండాల్నా..? నా ముందే కులం పేరుతో ఛెయిర్ పర్సన్ ను పట్టుకుని బూతులు తిడతారా... ఆయన తల్లిని, తండ్రిని, కులాన్ని, మతాన్ని తిడతారా..? బజారు రౌడీల మాదిరి వ్యవహరిస్తారా..?
ఆయన చేసిన తప్పేంటి..? ధర్మాన్ని, చట్టాన్ని కాపాడటం ఆయన చేసిన తప్పా..? రూమ్ లో ఆయనను మీ మంత్రులు కొట్టబోతే బచ్చుల అర్జునుడు కాపాడి క్షేమంగా తీసుకెళ్లాడు. మీరేం దున్నపోతులా..?
ఆర్టికల్ 169పై తప్ప ఎప్పుడూ మండలి గురించి శాసన సభలో చర్చించకూడదు. ఇవి రెండూ స్వయం ప్రతిపత్తిగల సంస్థలు. రాజ్యాంగం చెప్పింది అదే. ఒక సభలో చర్చను మరో సభలో వక్రీకరించి మాట్లాడటం, అనుమతి లేకుండా తెరపై ప్రదర్శించడం రాజ్యాంగ విరుద్దం కాదా..?
విజ్ఞులు కాదు మీ దగ్గర ఉన్నవాళ్లు, కరడు గట్టిన నేరగాళ్లు..86మందిపై(57%) క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 58మంది(33%)పై సీరియస్ క్రిమినల్ కేసులు,మర్డర్ కేసు ఒకరిపై, హత్యాయత్నాల కేసులు 10మందిపై, కిడ్నాప్ కేసులు 7గురిపై ఉన్నాయి.
ఆర్ధిక ఉగ్రవాది రాష్ట్రాన్ని అపహాస్యం చేయాలని అనుకుంటే మేమందరం భయపడిపోవాల్నా..?
రాజ్యాంగంలో కేపిటల్ అనేదే లేదని అనుకుంటే మరి నీ బిల్లులో 3కేపిటళ్లు అని ఎందుకు పెట్టావు..? లెజిస్లేటివ్ కేపిటల్, ఎగ్జిక్యూటివ్ కేపిటల్, జ్యుడిషియల్ కేపిటల్ అని 3సార్లు కేపిటల్ అని ఎందుకు పెట్టావు..? అది తప్పు కాదా..? నీకు కావాలంటే ఇడుపుల పాయలో పెట్టుకో కేపిటల్, మీ నాయన సమాధి పక్కనే కూర్చో..
సభా ప్రసారాలన్నీ ఏకపక్షం చేస్తారా..? ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలనే చూపిస్తారా..? లోన ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియకుండా అడ్డం పడతారా..? చివరికి కౌన్సిల్ చెయిర్ పర్సన్ ప్రసంగాన్ని కూడా ఎడిట్ చేసి ప్రదర్శిస్తారా..?
జరిగిన సంఘటనలను చూపించే మీడియాపై కేసులు పెట్టే ప్రభుత్వం ఉన్మాదం కాదా..? స్కూల్ క్లాస్ రూమ్ ల లోపల పోలీసులు ఉంటారు. విద్యార్దులు బైట ఉంటారు..తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వాటిని ఛానల్స్ చూపిస్తే వాళ్లపై నిర్భయ యాక్ట్, ఎస్టీ ఎస్టీ అట్రాసిటి కేసులు పెడతారు..? ఐపిసి 448, 354(సి), 509, రెడ్ విత్ 34, 3(2) విఏ సెక్షన్లన్నీ పెడతారు.. ఉదయం 10గం కు జరిగితే రాత్రి 10.30కు కేసు పెడతారు. ఇది ఉన్మాదం కాదా..?
మాజీమంత్రి జవహర్ ను నిన్నటిదాకా హవుస్ అరెస్ట్ లో ఉంచారు. వందలాది మందిని హవుస్ అరెస్ట్ లు చేశారు. టిడిపి ఎంపిపై దాడిచేశారు, చొక్కా చింపారు,గోళ్లతో గిచ్చారు,జైలుకు పంపారు.
కౌన్సిల్ రద్దు చేయాలని అనుకున్నప్పుడు, ఈ 3రోజులు సమయం అసెంబ్లీకి ఎందుకు ఇచ్చారు.? దారికి రాకపోతే రద్దు చేస్తామని బెదిరించడానికా..? హార్స్ ట్రేడింగ్ కు పాల్పడటానికా..?
మీరెన్ని వేధింపులు చేసినా, టిడిపి ఎమ్మెల్సీలు నిబద్దతగా పోరాడారు. ప్రజాస్వామ్య రక్షకులుగా చూస్తున్నారు, హీరోలుగా చూస్తున్నారు. కళ్లు తిరిగే డబ్బులు ఆశ చూపినా, పదవుల ప్రలోభాలు పెట్టినా లొంగని ధీరులు. ఆస్తులపై దాడులు చేస్తారా..? అక్రమ కేసులు పెడతారా..? మీ బెదిరింపులకు లొంగకుండా చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయారు టిడిపి ఎమ్మెల్సీలు. ప్రజలంతా గుండెల్లో పెట్టుకున్నారు.
కౌన్సిల్ సభాపతి షరీఫ్ ను ఆరాధిస్తున్నారు, ఒక ఐకాన్ గా చూస్తున్నారు.
కౌన్సిల్ లో బిల్లు ఆమోదం కాకపోతే ముఖ్యమంత్రికి అవమానం అట..ఎక్కడైనా ఉందా ఇది..? ప్రజాస్వామ్యం ఇది..నువ్వంటే ఎవరూ భయపడరు ఇక్కడ..భయపడితే నీ ఎమ్మెల్యేలే భయపడతారు నువ్వెక్కడ రూమ్ లో వేసి కొడతావో అని..? మాకేం భయం..?
గతంలో రాజశేఖర రెడ్డికి చెప్పగలిగిన వాళ్లు కూడా ఇప్పుడీయనకు చెప్పలేక పోతున్నారు.
కౌన్సిల్ రద్దుపై మీరు తీర్మానం చేసినా పంపినా కేంద్రం ఆమోదించాలని ఎక్కడా లేదు..
బిల్లులపై సెలెక్ట్ కమిటి వేశారు, అవుట్ కమ్ రావాల్సివుందని మీ ఏజినే కోర్టులో అఫిడవిట్ వేశారు. అదివచ్చేదాకా కార్యాలయాల తరలించరాదని అంటున్నారు.
అమ్మవడి, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కమిషన్ బిల్లులను సాధారణ బిల్లుగా వస్తే సవరణలు చేసి పంపితే పాత బిల్లునే ద్రవ్యబిల్లుగా మార్చి మళ్లీ పంపిస్తారా..? అది జరగలేదని కౌన్సిల్ పై ఉక్రోషమా..? అందరినీ కొనేయాలని హార్స్ ట్రేడింగ్ చేస్తారా..?
నేను ఎవరినీ పార్టీలోకి తీసుకోను,విలువలతో రాజకీయం చేస్తాను గప్పాలు కొట్టి ఇప్పుడు చేస్తున్నదేంటి..?
నీ సహ నిందితులందరికీ ప్రభుత్వంలో పదవులిస్తారా..? టిటిడి పదవులా..? అడ్వయిజర్ పదవులా..? ఇక సాక్షులకు ఇంకెన్ని ఇస్తారో..?