గుజరాత్ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు !

September 22, 2020

పక్కదేశాల్లోని బాధిత హిందువులను ఆదుకునేందుకు సహృదయంతో నరేంద్రమోడీ ఒక చట్టం తెస్తే కాంగ్రెస్ దానిని తప్పుపడుతోందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వ్యాఖ్యానించారు. పౌరసత్వ చట్టానికి మద్దతుగా జరిపిన ర్యాలీకి హాజరైన ముఖ్యమంత్రి ముస్లిం - హిందు మతాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు వెళ్లాలనుకుంటే వెళ్లి బ్రతకడానికి ప్రపంచంలో 150 దేశాలున్నాయి. కానీ హిందువులకు భారతదేశం ఒక్కటే ఉంది. మోడీ తెచ్చిన చట్టం బాధితులకు మేలు చేయడానికే గాని ఇతరులను వెళ్లగొట్టడానికి కాదని ఆయన వ్యాఖ్యానించారు.

అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అఖండ భారతంలో భాగమైన అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా ప్రాంతాలన్నీ హిందువులు అశేష సంఖ్యలో ఉన్న దేశాలు అని... కాలక్రమేనా స్థానికుల హింసతో హిందువుల సంఖ్య విపరీతంగా పడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అఫ్గాన్ లో 2 లక్షల మంది హిందువులుండేవారని అక్కడ 500 మంది మాత్రమే మిగిలారని... అందుకే మిగతా వాళ్లు కూడా పక్కదేశాల నుంచి మన వద్దకు రావాలి అనుకుంటున్నారని వారందరినీ ఆదుకునే ప్రయత్నం పౌరసత్వ సవరణ చట్టం. అంతేగాని ఎవరినో వ్యతిరేకించడానికి ఈ చట్టం కాదన్నారు. పాకిస్తాన్ లో హిందువుల జనాభా తగ్గుతుంటే... ఇండియాలో పెరుగుతుందనే విషయం గమనించాలని కోరారు.