మోడీకి రామోజీ ఇచ్చిన సలహాకు ప్రధాని ఏం చెప్పారు?

September 24, 2020

దేశ వ్యాప్తంగా 20 మీడియా సంస్థల అధినేతలతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. కరోనా కమ్ముకొస్తున్న వేళ.. వివిధ రంగాలకు చెందిన వారితో భేటీ అవుతున్న ఆయన.. తాజాగా మీడియా అధినేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కొన్ని సలహాలు.. సూచనలుచేశారు.
దేశ జనాభాలో 65 శాతం మంది గ్రామాల్లోనే ఉన్నారని.. కరోనా నుంచి పల్లెలకు రక్షణ కవచం ఏర్పర్చటానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. గ్రామీణ ప్రజల్ని కరోనా ముప్పు నుంచి తప్పిస్తే.. వైద్యరంగం మీద భారీ భారం తగ్గుతుందన్నారు. టీకాలు.. ఔషధాల తయారీలో మన దేశ పరిశ్రమ గొప్ప ముందడుగు వేసిందన్నరామోజీ.. వాళ్లందరిని మీరు ఆహ్వానించి అవసరమైన మద్దతు తీసుకోవటం.. కావాల్సినంత చేయూత ఇస్తేతక్షణం పరిశోధనలపై ఫోకస్ చేసి సాధ్యమైనంత త్వరగా కరోనాకు టీకాలు.. మందులు కనుగొంటారన్నారు.
దీనికి స్పందించిన ప్రధాని.. తాను ఇప్పటికే ఔషధ.. వైద్య పరికరాల తయారీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పలు అంశాల్ని చర్చించినట్లుచెప్పారు. కలిసికట్టుగా కొన్ని పథకాల్ని రూపొందించామన్నారు. ప్రపంచం మన మీద పెట్టుకున్న విశ్వాసాన్ని ప్రైవేటు రంగం పూర్తి చేస్తుందన్న విశ్వానం తనకు ఉందని చెప్పారు. ఇటీవల కాలంలో ఫార్మాకంపెనీల ప్రతినిధులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిన అంశం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. మరి.. అలాంటి విషయాన్ని మర్చిపోయి రామోజీ అలాంటి సూచన చేశారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Read Also

వెంకన్న సొమ్ము స్వాహా!
చంద్రబాబును ఇలా ఎపుడూ చూసి ఉండరు
హౌస్ అరెస్టు నుంచి విడుదల, బయటకొచ్చి ఏం చేస్తాడు ?