ఎన్నికలు ఎవ‌రికి క‌లిసి వ‌చ్చేనో

September 22, 2020

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం అందరికీ విదితమే. మీడియా సమావేశంలో సునీల్ అరోరా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. మొత్తం 543 లోక్సభ స్థానాలతో పాటు ఏపీ అసెంబ్లీ 175… ఒడిసా 147… సిక్కిం 32.. అరుణాచల్ ప్రదేశ్ 60, స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఏపీ లలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న ఎన్నికలను జరపనున్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా ఏపీ లోని రాజకీయ పార్టీలలో తాజా పరిస్థితి ఒక్కసారిగా టెన్షన్ పెంచేసింది.. మే నెలలో జరుగుతాయి అనుకున్న ఎన్నికలు ఒక్కసారిగా ఏప్రిల్ 11 న జరుగుతాయంటూ ఈసీ ప్రకటించడంతో ఏపీ లోని రాజకీయ పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ప్రధాన అధికార పార్టీ అయినా టీడీపీ కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ, కానీ ఇప్పటి వరకూ అభ్యర్ధుల ఎంపికలో 50 % శాతం కూడా రీచ్ అవ్వలేకపోయాయి. సమయం ఉంది కదా అభ్యర్ధులని ప్రకటించుకోవచ్చు అని అనుకున్న ఇరు పార్టీలకి ఈసీ ఘోరమైన దెబ్బ కొట్టింది.

అయితే చంద్రబాబు తెలివైన, అనుభవజ్ఞులైన నాయకుడు కాబట్టి ఇలాంటి పరిస్థితిని ముందుగానే ఊహించి అభ్యర్ధుల ఎంపిక విషయంలో దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయితే కొంతమంది సిట్టింగు అభ్యర్ధుల విషయంలో తలమునకలవుతున్న బాబు తాజాగా ఈసీ నిర్ణయంతో ఇప్పుడు సిట్టింగులకే పట్టం కట్టడానికి సిద్దమవుతున్నారట. ఇక వైసీపీ విషయానికి వస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా సరిగా అభ్యర్ధులని ఖరారు చేయని జగన్. తాజా ఈసీ నిర్ణయంతో తెగ వర్రీ అవుతున్నాడని తెలుస్తోంది.ఇక జనసేన విషయాని వస్తే అభ్యర్ధుల ఎంపికలో జనసేన పూర్తిగా వెనుకబడి ఉన్నా తనదైన వ్యూహాలతో పవన్ ముందుకు వెళ్లనున్నాడట. అఫీషియల్ గా అభ్యర్ధులని ప్రకటించకపోయినా చాలా నియోజకవర్గాలలో టిక్కెట్లు ఖరారు చేశారని తెలుస్తోంది. మరి ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ఎవరికి నష్టం కలుగచేస్తుంది అంటే. ఆ ప్రభావం మూడు పార్టీలపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు.