రాజధాని మార్పు పై న జగన్ ఎందుకింత పట్టుబడుతున్నాడు?

September 25, 2020

జగన్ కెసిఆర్ మాదిరిగా పరిపాలన నిర్వహించాలని మొదటినుంచి అనుసరిస్తూనే ఉన్నాడు.ఆ పరంపరలోనే సచివాలయానికి కెసిఆర్ మాదిరిగా చాలా తక్కువసార్లు హాజరవుతూ ఫామ్ హౌస్ లాంటి క్యాంప్ హౌస్ నుంచే జగన్ పరిపాలన నిర్వహిస్తున్నాడు.సామాన్యుడికి అవినీతి ప్రభావం లేకుండా ఉండాలని కెసిఆర్ ఎమ్మెల్యేలని , స్థానిక నాయకులను కట్టుదిట్టం చేశాడు. ఆర్థికంగా వారు బలోపేతం కాకపోతే తాను చెప్పినట్లు వింటారు అనేది కెసిఆర్ ఆలోచన. వారికి ఆర్థిక అవసరం ఉంటే తనని మాత్రమే మే ఆశ్రయించాలి కానీ వేరే ఇతర ఆర్థిక వనరులు ఉండటానికి వీల్లేదు అనే ఆలోచన ఆచరణ కలిగిన వ్యక్తి కేసీఆర్. అందుకే చూడండి తెలంగాణలో మంత్రులు కూడా నోరు విప్పరు. ఎమ్మెల్యేల సంగతి సరేసరి.
దాదాపు నియంత లక్షణాలు ఉండే జగన్ కూడా కెసిఆర్ దారిలోనే వెళుతున్నాడు. గత ఎనిమిది నెలలుగా వైకుంఠ దర్శనం పొందిన ఎమ్మెల్యేలకి కూడా జగన్ దర్శనం మాత్రం జరగలేదు
. ఎమ్మెల్యేలను కట్టుదిట్టం చేయాలి అంటే వారికి అవసరమైనప్పుడు ఇవ్వగలిగిన ఆర్థిక వనరులు ఉండాలి . అవి వారి స్వయం సంపాదన కాకూడదు. ఈ చిన్న లాజిక్ ని జగన్ పెద్ద ప్రక్రియగా పాటిస్తున్నాడు.
దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలు చేతిలో ఉన్నప్పుడే స్థానిక ఎన్నికల్లో అయినా తదనంతరం ఎన్నికల్లో ఆయన అనుకున్నది సాధించగలరు. కానీ ఇప్పటికి ఇప్పుడు ఐదు వేల కోట్ల రూపాయలు తేవాలి అంటే స్కాములు చేయాలి. అయితే తే ఈనాడు లాంటి దినపత్రిక లతోపాటు చంద్రబాబు నాయుడు కూడా డేగ చూపులతో జగన్ ఎక్కడ దొరుకుతాడు అని ఎదురు చూస్తున్నారు.
ఎటువంటి స్కాములు లేకుండా భూముల ద్వారానే విజయవంతం కావచ్చని కెసిఆర్ బాటలోనే జగన్ గ్రహించాడు. కాలేశ్వరం ప్రాజెక్టుని 40 వేల కోట్ల నుంచి 80 వేల కోట్ల కు పెంచి మెగా వారిద్వారా మెగా ట్రెండ్ సృష్టించారు. అదే వ్యూహాన్ని అనుసరించే క్రమంలో జగన్ దృష్టి మొదట అమరావతి మీద పడింది. అయితే బ్రిటిష్ వారి కాలం నుండి పకడ్బందీగా భూమి రికార్డులు ఉండటంతో జగన్ నిరాశకు గురయ్యాడు. ఆ పరంపరలోనే అమరావతి ప్రాంతంపై నెగిటివ్ ప్రచారం చేశారు.అయితే వారు అనుకున్నట్టుగాఅమరావతిలో ధరలు పడిపోలేదు. అమ్మకాలు జరగలేదు. దానితో మరొక వ్యూహానికి తెరదీశారు. అదే దొనకొండలో రాజధాని నిర్మాణం అనే పేరుతో. అయితే పెద్ద స్పందన ప్రజల నుంచి కొనుగోలుదారుల నుంచి చి రాలేదు. ఫలితంగా ధరలు పెరగలేదు.భూముల కొనుగోలు కూడా ఎవరూ చేయలేదు. ఫలితంగా జగన్ మరింత నిరుత్సాహానికి గురయ్యాడు.
ఈ క్రమంలోనే మరో నాటకానికి తెరతీశాడు. ఈ నాటకంలో ప్రధాన సూత్రధారి ఒక రాజకీయ సలహాదారుడు. ఆయన కింద పనిచేస్తున్న మరో ఇద్దరు సలహాదారులు. (ఇందులో ఒక విదేశీ సంబంధ వ్యక్తి కూడా ఉన్నారు). రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చాలా మంది అనుచరులు విశాఖలో భూములను రకరకాలుగా పొందారు. వారందరూ ఈ ప్రధాన రాజకీయ సలహాదారుడు ఆధ్వర్యంలో ముఠా గా తయారయ్యారు.
ఇప్పటికీ భూ రికార్డులు ఉత్తరాంధ్రలో సరిగా లేవు అనేది అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే తమ ప్లాన్ బి కింద విశాఖ రాజధానిగా జగన్ ప్రణాళికను రచించాడు. అయితే విశాఖ పైన దృష్టి పెడితే అందరికీ అనుమానం వస్తుందని భావించి, సాధ్యము గాని హైకోర్టు బదలాయింపు ముందుకు తీసుకొచ్చి తాను గొప్పవాడిని, మంచి పరిపాలకుడిని అనిపించుకునే డ్రామాకి తెరతీశారు.
ముఖ్యంగా కాపులుప్పాడు ప్రాంతంలో జరిగిన లావాదేవీల విచారిస్తే సలహాదారులు బాగోతం బయటపడుతోంది.
అయితే ఊహించని రీతిలో ప్రజలు బలంగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం, ఒకవేళ వైజాగ్ రాజధాని అయినా ఎంతకాలం ఉంటుందన్న భయంతో పెద్దగా భూముల రేట్లు పెరగలేదు.
దానితో జగన్ మానసిక పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. ఈ క్రమంలోనే మండలిని రద్దు చేసి .మరో తప్పిదం చేశారు. ఈ ప్రక్రియలు అన్నిట్లోనూ న్యాయస్థానం తనకు పెద్ద అవరోధంగా జగన్ భావిస్తున్నారు. అందుకే న్యాయస్థానాన్ని ఎలా బలహీన పరచాలి అని చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు

చూద్దాం ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్లినవారికి ప్రకృతి సమాధానం చెబుతుంది అనేది మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్నదే