అదే జరిగితే... బాలయ్య, జగన్ కలిసి షేక్ హ్యాండ్ ఇస్తారు

September 23, 2020

ఈ కాంబినేషన్ అసాధ్యం. ఇదేదో గాలివార్త అనుకుంటున్నారా? గాలి వార్త కాదు... కానీ జరగడానికి అవకాశం అయితే ఉంది. అయితే, ఇది అపాయింట్ తో కూడిన కలయిక కాదు. ఒక సాధారణ సంప్రదాయ వేదిక మీద అనుకోకుండా జరగబోయే కలయిక. 2011 నుంచి ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను పెద్దగా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రెండు సార్లు (ఒకసారి రెండేళ్లకు, ఇంకోసారి మూడేళ్లకు కలిపి) ప్రకటించారు. కానీ రెండోసారి ప్రకటించిన అవార్డుల ప్రదానం మాత్రం జరగలేదు. కొన్ని వివాదాల వల్ల ఆగిపోయింది.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే...  సినిమాను పెద్దగా పట్టించుకోని జగన్ మాత్రం ఎందుకో ఆలస్యం చేయకుండా నంది అవార్డులు ఇచ్చేయాలని, పెండింగ్ పెట్టొద్నది ఆర్డర్ చేశారట. 2014, 2015, 2016 ఏడాదిలకు గాను మహేష్, ఎన్టీఆర్, బాలకృష్ణలకు అవార్డులు వచ్చాయి. ఆ జాబితాలో ప్రభాస్ కూడా ఉన్నాడు. ఈ అవార్డులు కనుక ఇస్తే... జగన్ చేతుల మీదుగా అవార్డు తీసుకుని బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు జగన్ కి షేక్ హ్యాండ్ ఇస్తారా? లేక పోతే... బాలయ్య హాజరు కారా? సాధారణంగా నంది వేడుకకు ముఖ్యమంత్రులు వస్తుంటారు. కాబట్టి జగన్ కూడా వచ్చే అవకాశాలే ఉన్నాయి. మరి గవర్నమెంటు ఈ అవార్డులను ఇస్తుందా, మళ్లీ హడావుడిలో పడి పెండింగ్ పెడుతుందా?