10 మందికి పైగా వైకాపాఎంపీలు బీజేపీలోకి జంప్?

September 22, 2020

వైకాపా ఎంపీలు బీజేపీలో జంప్ ఇవ్వ‌బోతున్నారా? 22 మందిలో స‌గం మందితో బీజేపీకి ట‌చ్‌లోకి వెళ్లారా? ఢిల్లీలో విజ‌య‌సాయిరెడ్డి వేగుల ద్వారా సేక‌రించిన స‌మాచారం మేర‌కు ప‌ది మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వంతో నేరుగా మాట్లాడుకుంటున్నార‌ట‌. ఇదే విష‌యాన్ని జ‌గ‌న్‌కు విజ‌య‌సాయి చేర‌వేశార‌ట‌. దీంతో ఆగ్ర‌హోద్ర‌గ్రుడైన జ‌గ‌న్ చిందులేశార‌ట‌. అయితే విజ‌య‌సాయి ఇలా ఎంపీల‌పై నేరుగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తే వాళ్లు బీజేపీలోకి వెళ్లి ప్ర‌త్యేక‌వ‌ర్గంగా గుర్తింపు కోరే అవ‌కాశం ఉంద‌ని.. నెమ్మ‌దిగా మంద‌లించాల‌ని సూచించార‌ట‌. విజ‌య‌సాయిరెడ్డి సూచ‌న‌తో జ‌గన్ కొద్దిగా త‌గ్గి ఎంపీల‌ను ఇలా కాకుండా నెమ్మ‌దిగా మంద‌లించార‌ట‌. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు అనే పేరుతో తాడేపల్లిలోని త‌న నివాసంలో శుక్రవారం వైసీపీ ఎంపీలతో జగన్‌ భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ఎంపీల‌కు నేరుగా హెచ్చ‌రిక‌లు జారీ చేశార‌ట‌. ‘‘ ఎంపీలంతా పార్టీ గీతలోనే నడవాలి. కొందరు ఎంపీలు వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ అభిప్రాయాలుగా చెబుతున్నారు. కొంద‌రు ఎంపీలు నేరుగా కేంద్ర మంత్రులు, ప్ర దానిని కలుస్తున్నారు. ఇలా మంచి ప‌ద్ధ‌తి కాదు. ఇలా చేస్తే షోకాజ్ నోటీసు జారీ చేయాల్సి వ‌స్తుంది’’ అని ఘాటుగా మంద‌లించార‌ట‌. వైకాపా ఎంపీలంతా ఇక నుంచి ఢిల్లీలో ఎక్క‌డి వెల్లాల‌న్నా, ఎవ‌రిని క‌ల‌వాల‌న్నా పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి అనుమ‌తి త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల‌ని ఆదేశించార‌ట‌. ప్ర‌ధానిని, కేంద్ర‌మంత్రుల‌ను వైసీపీ ఎంపీలు క‌ల‌వాల‌నుకుంటే ఆ విష‌యం ముందుగా విజ‌య‌సాయిరెడ్డికి తెలియ‌జేయాల‌ని, ఆయ‌న అంగీక‌రించి అనుమ‌తిస్తేనే క‌ల‌వాల‌ని..లేదంటే క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ ఘాటుగానే హెచ్చ‌రించారు. ఎంపీలు ఎవ‌రిని క‌లిసినా ప‌క్క‌న విజ‌య‌సాయిరెడ్డి త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందేన‌ని అలా కాక‌పోతే షోకాజ్ నోటీసులు అందుకునేందుకు సిద్ధంగా ఉండాల‌ని వార్నింగ్ ఇచ్చార‌ట‌.

అయితే అస‌లు విష‌యం ఏంటంటే వైసీపీకి చెందిన కొంద‌రు ఎంపీలు నేరుగా బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌ట‌. వారు గ్రీన్ సిగ్న‌ల్ ఇప్పుడిస్తే...ఇప్పుడే కాషాయం కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మంటూ సంకేతాలు పంపార‌ట‌. అయితే బీజేపీ అధిష్టాన‌మే ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేద‌ట‌. గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ఎంపీలు, కోస్తా, రాయ‌ల‌సీమకు చెందిన వైసీపీ ఎంపీలు బీజేపీ వారు ఎప్పుడు పిలుస్తారా? అని ఎదురుచూస్తున్నార‌ట‌. తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్న విజ‌య‌సాయిరెడ్డి, జ‌గ‌న్‌లు సామ‌దానబేధ దండోపాయాలు ప్ర‌యోగించి ఏదో విధంగా త‌మ ఎంపీలు బీజేపీలో చేర‌కుండా చేసేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే క‌మ‌ల‌నాథులు క‌న్నుగీటితే చాలు..లోక్‌స‌భ‌లో ఎంపీల సంఖ్య‌లో 4వ స్థానంలో వైసీపీ నుంచి 10 మందికి పైగా ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ట‌.