వైఎస్ దార్శనికుడు.. జగన్ శూన్యవాది

September 24, 2020

అమరావతి తరలింపు జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపుతోంది. దీనిపై ఇప్పటివరకు పూర్తిస్థాయి అధికారిక ప్రకటన రాకపోవడంతో కేంద్రం స్పందించలేదు. కానీ అమరావతి తరలింపుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. ప్రజలు తిరగబడ్డారు. రైతులు నిరసిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు జాతీయ ప్రముఖులు, ఇతర పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ప్రముఖ జాతీయ జర్నలిస్టు శేఖర్ గుప్తా తీవ్రంగా స్పందించారు. మూడు రాజధానులు, రెండు హైకోర్టు బెంచులు... కచ్చితంగా తుగ్లక్ నిర్ణయం అని, అమరావతిని ఆపేయడం అనేది దేశానికే నష్టదాయకమైన నిర్ణయం అని అభిప్రాయపడ్డారు. 

ఏపీలో మొదట్నుంచి పారిశ్రామికవేత్తలున్నారు. అమరావతిని వారంతా కలిసి అద్భుతంగా నిర్మించగలరు. రాబోయే 60 ఏళ్లలో దేశంలోనే తొలి గ్రీన్ ఫీల్డ్ నగరంగా తీర్చిదిద్దగలరు. ఎందుకో జగన్ అమరావతిపై వ్యతిరేకత పెంచుకున్నారు. ఒకవేళ జగన్ స్థానంలో వైఎస్ ఉండి ఉంటే... అమరావతిని కొనసాగించేవాడు. కాకపోతే అందులో ఆయన ముద్ర వేసుకునేవాడు. అంతేగాని రాజధానిని మార్చేవాడు కాదు. కానీ జగన్ శూన్యవాది ... మూడు రాజధానుల నిర్ణయం కచ్చితంగా పిచ్చి తుగ్లక్ నిర్ణయంగా అభివర్ణించాల్సిన అవసరం ఉంది. ఇది రాష్టంతో పాటు దేశాన్ని నష్టపరచగలిగిన ప్రమాదకరమైన నిర్ణయం అని శేఖర్ గుప్తా వ్యాఖ్యానించారు. 

ఈ దశలో కేంద్రం జోక్యాన్ని శేఖర్ డిమాండ్ చేశారు. మోడీ ఇందులో కలగజేసుకుని అమరావతి మార్పును ఆపాలని అన్నారు. ఇలాంటి పిచ్చి నిర్ణయాలను కేంద్రం అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ స్వయంగా కలగజేసుకోవాలని అన్నారు. ప్రముఖ కంపెనీలు, అంతర్జాతీయ కంపెనీలు ఏపీ నుంచి వెళ్లిపోవడానికి కారణం ప్రభుత్వ ధోరణే అని శేఖర్ గుప్తా విశ్లేషించారు. 

దేశమంతా మన వైపు చూసేలా చేస్తానని చెప్పిన జగన్... అలాగే చేశారు. కాకపోతే దేశమంతా తిట్టడానికి మనవైపు చూస్తోంది. ఈ ప్రపంచం మొత్తం మీద మాతృభాషలో పాఠశాలలు అందుబాటులో లేని ఏకైక ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ అవతరించేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందటరూ పెట్టబడిదారులను బతిమాలిడితే జగన్ తిడుతున్నారు. తాజాగా రాజధాని మార్పు అనే ప్రమాదకరమైన నిర్ణయాన్ని ఇంతవరకు చరిత్రలో తీసుకున్న ఏకైక వ్యక్తి పిచ్చి తుగ్లక్ గా పేరొందిన ఔరంగజేబు మాత్రమే. దానిని జగన్ తలకెత్తుకున్నారు. ఇపుడు జగన్ కారణంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు రాష్ట్ర ప్రజలు.