వైసీపీకి మంచి ఐడియా ఇచ్చిన లోకేష్

September 22, 2020

మేము కనుక రంగంలో దిగితే నా సామిరంగా మెడలు వంచడం కాదు నరుకుతాం అన్నట్లు చెప్పిన వైఎస్ జగన్... ఎన్నికలయ్యాక బీజేపీకి మెడనొప్పి వస్తే మందు రాస్తున్నారు. ప్రతి విషయంలో దౌర్జన్యం, నిలదీస్తే ఓర్వలేని తనం, తప్పులు ఎత్తిచూపితే బూతులు. మూడు బూతులు, ఆరు రద్దులతో వైభవంగా సాగుతోంది జగన్ పాలన. ఈ నేపథ్యంలో తాజగా వైసీపీ పార్లమెంటులో సృష్టించిన వీరంగంపై లోకేష్ నారా స్పందించారు. అయితే... ఈ సందర్భంగా వైసీపీకి మంచి ఐడియా ఇచ్చారు. 

మా ప్రభుత్వం ఉన్నపుడు మాటిమాటికి ప్రత్యేక హోదా గుర్తుచేసుకుని గుక్కపట్టి ఏడ్చిన జగన్ గారు.. ఎందుకు దాని గురించి మాట్లాడం లేదో జనాలకు తెలుసున్నారు. ఇక పోతే... ఈరోజు పార్లమెంటులో వైసీపీ నాయకుల తీరు చూశాక లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు చెబుతుంటే ఉలిక్కిపడి... ప్రసంగం ఆపడానికి ఎందుకు ప్రయత్నించడం అన్నట్లు మాట్లాడారు లోకేష్. లోక్ సభలో తమ సభ్యుడు రామ్మోహన్ నాయుడు ప్రసంగిస్తున్నపుడు వైసీపీ సభ్యుడు గోరంట్ల మాధవ్ అడ్డుతగలడంపై లోకేశ్ మండిపడ్డారు. ఆ వీడియోను లోకేశ్ సోషల్ మీడియాలో పెడుతూ ’వైసీపీ నాయకులకు చట్ట సభలు అంటే గౌరవం లేదని, వైసీపీ సభ్యులు అసెంబ్లీలో రౌడీల్లా ప్రవర్తించారని, శాసనమండలి పరువు మంట గలిపారని, ఆఖరికి పార్లమెంట్ ని కూడా వీళ్లు వదల్లేదంటూ ధ్వజమెత్తారు. వైసీపీ ఎక్కడైనా రౌడీయిజమే చేస్తుందని, సాటి సభ్యుడిపై దాడికి యత్నించారంటే వారి ఉన్మాద స్థాయి అర్థమవుతుంద’ని విమర్శలు కురిపించారు .అయితే... మీ ఈ అరాచక శక్తిని మంచికి ఉపయోగిస్తే ఇంకా బాగుంటుందని చెప్పిన లోకేష్... ‘‘ఇదే గూండాయిజంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించ వచ్చు కదా?’’ అని వైసీపీకి సలహా ఇచ్చారు. ఇది మంచి ఐడియా. మరి వైసీపీ ఏం చేస్తుందంటారు?

నిజమే వైసీపీ నేతల నోటి దూలకు ప్రధాని అయినా తగ్గాల్సిందే కదా... మరి బెదిరించి ముట్టడించి ఢిల్లీ నుంచి వచ్చేటపుడు ఆ ప్రత్యేక హోదా కాస్త పట్టుకురండి అంటున్నారు ఏపీ ప్రజలు.