వైసీపీ ఎమ్మెల్సీ ఫ్లెక్సీ చించిన కార్యకర్తలు

September 25, 2020

వైసీపీలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది. కాంగ్రెస్ లో అంతర్గత గొడవలు చాాలా కామన్. ఆ జబ్బు ఇపుడు వైసీపీకి వచ్చినట్టుంది. 151  సీట్లు సాధించి తిరుగులేని ఆధిపత్యంలో ఉన్నా కూడా పార్టీ కార్యకర్తలు జగన్ కి జంకడం లేదు. జగన్ సొంత జిల్లా కడపలోనే వైసీపీకి చెందిన ఇరువర్గాలు గొడవపడి ఫ్లెక్సీలు చించి ఎమ్మెల్యేని కేర్ చేయలేదు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.

కడప జిల్లాలోని చాపాడు మండలం, బద్రిపల్లె సచివాలయ ప్రారంభోత్సవం రభసగా మారింది. ఇరువర్గాలు ఆధిపత్య పోరుకు దిగాయి. సచివాలయం ప్రారంభోత్సవంలో ఒక వర్గానికే ప్రాధాన్యం ఇచ్చారని మరో వర్గం గొడవకు దిగింది. స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై వారు తీవ్రమైన నిరసన వ్యక్తంచేశారు. అయినా వీరిని పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే ఫ్లెక్సీని చించిపారేశారు. దీంతో వారిని అఢ్డుకోవడానికి కొందరు వచ్చారు. ఈ సందర్భంలో తోపులాట జరిగింది. వాగ్యుద్దం జరిగింది. చివరకు వాదులాట అనంతరం ఎమ్మెల్యే వర్గం కొంచెం తగ్గడంతో గొడవ సద్దుమణిగింది. 

వైసీపీలో రచ్చ ఇదే మొదటి సారి కాదు. కడపలో ప్రతి ఒక్కరు జగన్ మా బాబాయి, మా అన్న, మా తమ్ముడు అనుకుంటూ ఎవరికి వారే ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. జగన్ సామాజిక వర్గం వాళ్లంతా జగన్ మా బంధువే అంటూ పోటీపడుతున్నారు. దీంతో గొడవలు తరచూ వస్తున్నాయి. వీటిని కంట్రోల్ చేయడంలో పార్టీ విఫలం అవుతోంది.