వైసీపీ పెయిడ్ ఆర్టిస్టుల రంగు బయటపెట్టిన RRR

వైసీపీ నేతల వేషాలను రఘురామరాజు కడిగిపారేశారు. చక్కగా పండే భూములను ఇచ్చిన పాపానికి చంద్రబాబుపై ఉన్న కోపాన్నంతా వైసీపీ అమరావతి రైతులపై చూపడాన్ని వారు పాపం చితికిపోతున్నారు.

జగన్ సర్కారు చంద్రబాబును ఏమీ చేయలేక రైతులపై కక్ష గట్టి పోలీసుల నిబంధనలతో అణిచివేసే ప్రయత్నం చేస్తోంది. పాపం జగన్ ఇగోకు వారి జీవితాలు బలైపోతున్నాయి. తాజాగా ఒక విచిత్రమైన కుట్రను అమరావతిలో లేవదీశారు. అమరావతిలో మూడు రాజధానులు కావాలి అని ఒక గుంపు ధర్నాచేసింది. దానికి అమరావతిలో బహిరంగ సభను పెట్టింది.

దీనిని నరసాపురం ఎంపీ కడిగిపారేశారు. ఒరే మీకు బుద్ధుందా? చేసేది ఏదో సరిగ్గా చేయండి. మూడు రాజధానులు కావాలని కర్నూలోడు అడగాలి, లేదా విశాఖోళ్లు అడగాలి... అమరావతి వాడు ఎవడైనా అడుగుతారా? మాకు ఒకటి సరిపోదు, కర్నూల్లో ఒకటి, విశాఖలో ఒకటి పెట్టండి అని వాడు అడుగుతాడా? ఎవడినో అద్దెకు తెచ్చి ఇంత ఫూలిష్ ధర్నా చేస్తారా? సిల్లీగా, స్టుపిడ్ గా, ఫూలిష్ గా, చైల్డిష్ గా... ఏంటిది అంటూ తన స్టైల్లో కడిగి పారేశారు. రఘురామరాజు ఎంత ఫైర్ తో చెప్పాడో కింద వీడియో చూడండి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.