కేసీఆర్ ని రిస్కులో పడేసిన చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోవిడ్ -19 బారిన పడ్డారు. చిరు స్వయంగా తన ట్విట్టర్లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది ఇండస్ట్రీకి, ఆయన అభిమానులకే కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా షాక్ కు గురిచేసిన విషయం. ఎందుకంటే రెండు రోజుల క్రితమే చిరంజీవి ప్రగతి భవన్లో తెలంగాణ సిఎం కెసిఆర్ ను కలిశారు. చిరంజీవితో పాటు నాగార్జున సిఎం కెసిఆర్, ఎంపి సంతోష్‌లను కలుసుకుని ఇటీవల హైదరాబాద్ లో వరద వినాశనానికి విరాళం చెక్కులను సిఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు.
అయితే ఆరోజు చిరు గాని, నాగార్జున గాని మాస్క్ ధరించలేదు. దీంతో కేసీఆర్, ఎంపీ సంతోష్ తదితరులు రిస్కులో పడ్డారు. ఇపుడు కేసీఆర్ కూడా పరీక్షలు చేయించుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. లక్కీగా చిరంజీవికి కరోనా లక్షణాలు ఏమీ కనిపించడం లేదు. ఇంటివద్దనే క్వారంటైన్లో ఉన్నారు.
65 ఏళ్ల చిరంజీవి ఈ రోజు ‘ఆచార్య’ షూటింగ్‌తో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టెస్టు చేయించగా కరోనా బయటపడింది. దీంతో “ఆచార్య” షూట్ మొత్తం వాయిదాపడింది.
తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోమని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. మెగాస్టార్ రెట్టింపు శక్తితో త్వరగా కోలుకుంటారని మేము ఆశిస్తున్నాం అంటూ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను. pic.twitter.com/qtU9eCIEwp
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 9, 2020